Ravi Teja: పండక్కి రిస్క్ చేస్తున్న రవితేజ
2026 సంక్రాంతికి భారీ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈసారి సంక్రాంతికి పలు భారీ, మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో రాజా సాబ్(the raja saab), మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad garu), భర్త మహాశయులకు విజ్ఞప్తి(Bhartha Mahasayulaku Wignyapthi), అనగనగా ఒక రాజు(anaganaga oka raju), నారీ నారీ నడుమ మురారీ(nari nari naduma murari)తో పాటూ కోలీవుడ్ నుంచి జననాయగన్(jana nayagan), పరాశక్తి(parashakthi) సినిమాలున్నాయి.
అయితే వీటన్నింటిలో ప్రతీ సినిమాకీ దానికుండే క్రేజ్ దానికి సపరేట్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి భారీ పోటీలో తన సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ రవితేజ రిస్క్ చేస్తున్నాడని అందరూ భావిస్తున్నారు. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా ఉన్న రవితేజ ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ప్రస్తుతం రవితేజకు ఓ సాలిడ్ హిట్ కావాలి. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రవితేజకు ఆ హిట్ ను అందించేట్టే ఉంది.
కానీ ఈ సినిమాను పండగ సీజన్ లో రిలీజ్ చేస్తే ఆ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్, కలెక్షన్లు షేర్ అవుతాయని, ప్రస్తుతం రవితేజ ఉన్న సిట్యుయేషన్ కు ఈ సినిమాను సోలోగా రిలీజ్ చేయడమో లేదా వీలైనంత తక్కువ పోటీ మధ్య రిలీజ్ చేయడమో మంచిదని, సంక్రాంతికి రిలీజ్ చేయడం రిస్కే అవుతుందని అందరూ రవితేజకు సూచిస్తున్నారు. మరి ఆడియన్స్ సూచనలను చిత్ర యూనిట్ పరిగణిస్తుందో లేదో చూడాలి.







