Bhagya Sri Borse: బ్లాక్ శారీలో మరింత ముద్దుగా కనిపిస్తున్న భాగ్యశ్రీ
మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) మొదటి సినిమాతోనే తన అందం, ఎనర్జీతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో కలిసి కింగ్డమ్(Kingdom) మూవీలో కనిపించి అలరించిన భాగ్యశ్రీ ఈ నవంబర్ లో కాంత మరియు ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king thaluka) సినిమాలతో ఆడియన్స్ ను పలకరించబోతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ భాగ్యశ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఇచ్చే అమ్మడు తాజాగా బ్లాక్ కలర్ శారీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు బ్లాక్ శారీలో భాగ్యశ్రీ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుందని, మునుపటి కంటే అందంగా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







