Yanamala: మాక్ అసెంబ్లీ చూసైనా జగన్ నేర్చుకోవాలి : యనమల
విద్యార్థుల మాక్ అసెంబ్లీ (Mock Assembly)లో ప్రతిపక్షం ఎలా వ్యవహరించిందో చూసైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నేర్చుకోవాలని తెలుగుదశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) హితవు పలికారు. చిన్న పిల్లలైనా ఎలాంటి తాత్కాలిక, శాశ్వత బహిష్కరణలకు తావివ్వకుండా, ప్రజా సమస్యలను సభలోనే ప్రస్తావిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు. కనీసం ఇప్పటికైనా జగన్ అసెంబ్లీ హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. సభ వెలుపల మాట్లాడటం కంటే, ప్రజాప్రతినిధిగా సభలో హాజరై చర్చించడం ముఖ్యమని ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. లేదంటే త్వరలోనే అర్హత (Eligibility) కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.






