Home Minister Anita: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : హోంమంత్రి ఆదేశాలు
దిత్వా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా చూపే జిల్లా కలెక్టర్లు (District Collectors), ఎస్పీ (SP)లకు హోంమంత్రి అనిత (Home Minister Anita) ఆదేశాలు జారీ చేశారు. శని (Saturday), ఆదివారాల్లో (Sunday) వచ్చే భారీవర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎక్కడా ప్రాణా, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ప్రమాకరమైన హోర్డింగ్స్ను (Hoardings) వెంటనే తొలగించాలని తెలిపారు. జిల్లాలు, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.






