Nara Lokesh: లోకేష్‌పై ట్విట్టర్ దాడి – జగన్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ (Y.S. Jagan) సోషల్ మీడియా వేదికగా తన ఆరోపణలతో తీవ్రస్థాయిలో అధికార కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ (Twitter) ద్వారా ఆయన అధికారులను నిలదీయడం ఇటీవల సాధారణంగా మారిపోయింది. మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహించలేని పరిస్థితుల్లో, సోషల్ మీడియా ఆయనకు ప్రధాన ఆయుధంగా మారింది. తాజా ఉదాహరణ కూడా అదే చూపిస్తోంది.
ఇటీవల ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖను తీవ్రంగా విమర్శిస్తూ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం విద్యాశాఖను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చూస్తున్నారు. ఈసెట్ (ECET) రిజల్ట్స్ వచ్చిన 45 రోజులు దాటినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభించకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. మే 15న ఫలితాలు వచ్చినా ఇప్పటికీ షెడ్యూల్ విడుదల కాకపోవడాన్ని ఆయన విద్యావ్యవస్థలోని గందరగోళానికి నిదర్శనంగా చెప్పారు. మరోవైపు ఇంజినీరింగ్ క్లాసులు మొదలవుతుండగా అడ్మిషన్లు జరగకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
ఇక్కడివరకు అయితే వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే. కానీ ట్వీట్ చివర్లో “పప్పూ నిద్ర వదులు” అనే పదం వాడటం రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసింది. లోకేష్‌ను “పప్పూ” అని సంబోధించడంపై పలువురు విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) సోషల్ మీడియా వేదికలలో లోకేష్‌పై “పప్పు నాయుడు” అనే పదాలు వినిపించేవి. కానీ అవి ఎక్కువగా చిన్న స్థాయి నాయకులు లేదా సోషల్ మీడియా కార్యకర్తల వద్ద మాత్రమే పరిమితమయ్యాయి. జగన్ స్థాయి నాయకుడు ఎప్పుడూ ప్రత్యర్థులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు అన్న ముద్ర ఉంది.
అయితే ఇప్పుడు జగన్ ఇలా విమర్శించడంపై ప్రతివిమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లోకేష్ గత నాలుగేళ్లుగా తన సత్త చాటుతూ పార్టీకి ఉపయోగపడే నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆయనపై ఇలా వ్యవహరించడం జగన్‌కు మంచికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కూడా ట్వీట్లలో “జగన్ గారు” అని పిలుస్తూ ఒక విధమైన మర్యాద చూపుతుంటారు. ఇక ఇప్పుడు జగన్ ఈ విధంగా ప్రత్యర్థులను వ్యక్తిగతంగా ఉద్దేశించి విమర్శించడం తన స్థాయిని తగ్గించుకోవడమేనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ పోరులో వ్యక్తిగత స్థాయికి దిగకుండా ఉండటమే ప్రజలకు మంచి సంకేతమని పలువురు సూచిస్తున్నారు.