Donald Trump: యూఎన్‌లో కుట్ర ..ఆ మూడు ఘటనలు నాకు అవమానమే

డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పక్క నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు ఉంటాయి. అలాంటీ భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితి (United Nations)లో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 23 నుంచి ఐక్యర్యాసమితి శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రథమ మహిళ మెలానియా (Melania) తో కలిసి ట్రంప్ న్యూయార్క్‌లోని యూఎన్ కార్యాలయానికి వచ్చారు. పైకి వెళ్లేందుకు మెలానియా, ట్రంప్ ఎస్కలేటర్ ఎక్కారు. ఇద్దకూ ఎక్కగానే సడన్‌గా లేస్కలేటర్ (Escalator) ఆగిపోయింది. దీంతో ఇద్దరూ కూడా అవాక్కయ్యారు. ఒకింత షాక్‌కు గురయ్యారు. దీంతో చేసేదేమీలేక మెలానియా మెట్లు ఎక్కి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్ కూడా మెట్లు ఎక్కేసి వెళ్లిపోయారు. దీన్ని ఘోర వమానంగా ట్రంప్ భావించారు. ఎస్కలేటర్ ఎందుకు అగిందంటూ చేతి సైగలు చేశారు. ఇదేదో పొరపాటున జరిగిందని సర్దుకుంటే, అనంతరం ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో టెలిప్రాంప్టర్ కూడా పని చేయలేదు. ఇదిలా ఉండగా మాట్లాడుతూన్న సమయంలో పూర్తిగా శబ్దం కూడా ఆగిపోయింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఉద్దేశపూర్వకంగా జరగడంతో దీని వెనుక కుట్ర దాగి ఉందని వైట్‌హౌస్ భావించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే తాజాగా ఈ మూడు పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.