China:వాణిజ్యం వివాదం వేళ.. అమెరికా, చైనా మధ్య కీలక పరిణామం

అమెరికా చైనాల మధ్య వాణిజ్య వివాదం కొనసాగుతున్న వేళ తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా (America) కు చెందినా ఆరు కంపెనీలపై బీజింగ్ (Beijing) ఆంక్షలు విధించింది. విశ్వసనీయత లేని కంపెనీల జాబితాలో చేర్చిన డ్రాగన్ తమ దేశంతో వాణిజ్యా న్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తైవాన్ (Taiwan) కు చెందిన సాంకేతిక సహకారం అందిస్తున్నాయన్న కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
మావన రహిత వాహనాల తయారీ సంస్థ సరోనిక్ టెక్నాలజీస్, శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ఎయిర్‌కోమ్, సబ్‌సీ ఇంజినీరింగ్ సంస్థ ఓషనీరింగ్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ జాబితాలో ఉన్నట్లు చైనా వాణిజ్య శాఖ వెల్లడిరచింది. వీటితోపాటు తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతకు ముప్పు ఉందన్న కారణంగా మరో మూడు అమెరికన్ కంపెనీలను ఆంక్షల జాబితాలో చేర్చింది. తైవాన్‌ను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా, దానితో సంబంధాలున్న కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.