YS Jagan: యూకే వెళ్లేందుకు జగన్‌కు షరతులతో కోర్టు అనుమతి

అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అక్టోబరులో యూకే (UK) వెళ్లేందుకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు (CBI court) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనమతినివ్వాలని జగన్ విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది. అక్టోబరులో 15 రోజుల పాటు వెళ్లవచ్చని, ఏయే దేశాలకు వెళ్లనన్నారు? తదితర సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.