Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ప్రధాని భేటీ

అమెరికా, పాకిస్థాన్ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. మెన్నామధ్య పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ (Shehbaz Sharif) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తో భేటీ అయ్యారు. వైట్‌హౌస్ (White House) లోని ఓవల్ ఆఫీసులో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.