Washington: ట్రంప్ ద రూలర్.. అమెరికాను ఎక్కడకు తీసుకెళతారో..?

అమెరికాలో ట్రంప్ పాలనను నిశితంగా గమనిస్తే… రెండుగా చూడవచ్చు. ట్రంప్ (Trump) ముందరికాలం.. ట్రంప్ పాలన.. ఎందుకంటే ట్రంప్ ముందున్న అమెరికా అధ్యక్షులు.. చర్య తీవ్రతను బట్టి తమ యాక్షన్ ఉండేలా చూసుకునేవారు. అంతేకాదు.. తమపై తమకు నియంత్రణ ఉండేది. ఉదాహరణకు బిల్ క్లింటన్, ఒబామా పాలనను పరిశీలిస్తే… ఉగ్రవాదులు విదేశాల్లోని తమ రాయభార కార్యాలయాలపై దాడి చేస్తే.. వారి ఆయువుపట్లపైకి మిస్సైల్స్ ఎక్కుపెట్టేవారు. వాటిని ధ్వంసం చేసి , శాంతించేవారు. కానీ ట్రంప్ అలా కాదు… తనకు నచ్చకుంటే డైరెక్టుగా యుద్ధమే అంటున్నారు.
అంతే కాదు.. తాను చెప్పింది జరగాలనుకునే తత్వం ట్రంప్ ది. కాదంటే ఎంతకైనా తెగిస్తారు. తన మద్దతున్న దేశాలతో ఏదైనా చేయించగలరు. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రదాడి తర్వాత.. ఐడీఎఫ్ గాజాపై దాడులతో విధ్వంసం సృష్టిస్తోంది. అక్కడ ఇంచుమించుగా హమాస్ నేతలందరినీ ఏరేసింది. అయితే.. ఆ తర్వాత కూడా అక్కడ నుంచి వెనుదిరిగే ఛాన్సుంది. కానీ ఇజ్రాయెల్.. వెనక్కు రావడం లేదు. ట్రంప్ రమ్మని ఆదేశించడం లేదు. దీని వెనక ట్రంప్ రియల్ ఆలోచనలు ఉన్నాయని కథనాలు వెలువడుతున్నాయి.
ఓవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో .. క్రెమ్లిన్ తో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేస్తున్నారు. అంటే.. ఓ విధంగా చెప్పాలంటే తమ వద్ద ఉన్న ఆయుధ కంపెనీల లాబీలకు వ్యాపారం జరిగేలా చూస్తున్నారు. మరోవైపు.. శాంతి చర్చలు కావాలని ప్రపంచానికి చాటుతున్నారు. అంటే బిజినెస్ కు బిజినెస్.. ప్రపంచం దృష్టిలో శాంతి దూతగా బిరుదు అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు ట్రంప్.
మిత్ర దేశాలను ఇరకాటంలోకి నెట్టి.. అక్కడ వ్యాపారమే చేస్తున్నారు ట్రంప్. దీనిలో భాగంగా అమెరికాకు సోదర దేశాలుగా భావించే కెనడా, మెక్సికోలకు చుక్కలు చూపించారు. గతంలో తమపై రక్షణ పరంగా ఆధారపడిన యూరోపియన్ యూనియన్ కు వ్యాపారం అంటే ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చేశారు. దీంతో ఇప్పుడు అమెరికాపై రక్షణపరంగా ఆధారపడలేమని ఆయాదేశాలు భావిస్తున్నాయి. ఫలితంగా నాటో తరహాలో తమకో డిఫెన్స్ వ్యవస్థ ఉండాలని ఆశిస్తున్నాయి. అంటే మిత్రదేశాలకు ట్రంప్.. అమెరికాను దూరం చేశారని చెప్పవచ్చు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటి.. మార్కెట్ పరంగా అతిపెద్దది.. అంతేకాదు..తమకు మిత్రదేశంగా ఉన్న భారత్ ను.. సైతం పక్కకు తోసేసిన ఘనత ట్రంప్ ది. అందుకే ఆయా దేశాలు కూడా ట్రంప్ తో ఎందుకొచ్చిన గొడవని సర్దుకుపోతున్నాయి. ఇక ఇండియా కూడా ఆరంభంలో వ్యాపారానికి సంబందించి రాజీకి ప్రయత్నించింది. అయితే ట్రంప్ టారిఫ్ ల ఎఫెక్ట్ .. సాగు, పాడి పరిశ్రమపై గట్టిగా ఉంటుందని తేలడంతో .. ఎదురు తిరిగింది. ఫలితంగా వందశాతం టారిఫ్ లు భరించే సమయం పచ్చింది. దీంతో ట్రంప్ కు మిత్రులు… శత్రువులు ఎవరూ ఉండరు. అంతా బిజినెస్సే.. ఇది అమెరికా వ్యూహాలు ఎదురు తన్నేవేళ ఎలా ఉంటుందో వేచి చూడాలి.