TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం… భక్తులకు అలర్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy Temple)లో బుధవారం నుంచి నెల రోజుల పాటు సుప్రభాత సేవ (Suprabhata Seva) రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం 1:23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. బుధవారం నుంచి తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు జరుపుతున్నట్లు వివరించారు. ధనుర్మాసం సందర్భంగా మూల విరాట్టుకు బిల్వపత్రాలతో సహస్ర నామార్చన జరిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శ్రీవల్లి పుత్తూరు చిలుకలతో రోజూ స్వామి వారికి అలంకరణ చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారికి విశేష నైవేద్యాలుగా బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రత్యేక ప్రసాదాలు నివేదన చేస్తున్నట్లు వివరించారు. భోగశ్రీనివాసమూర్తి (Bhogasrinivasamurthy)కి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD) పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు.






