టీటీడీలో మరో వివాదం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తనకు అన్యాయం జరిగిదంటూ హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతుండగా, తమ కుటుంబం నుంచే రమణ దీక్షితులను ప్రధాన అర్చకుడిగా నియమించడాన్ని హైకోర్టులో ఆయన సవాల్ చేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది. శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగుతూ ప్రభుత్వం, టీటీడీపై కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.