ఏపీలో రిలయన్స్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రీసైకిల్డ్ పాలిస్టర్ స్టేపుల్ ఫై•ర్ ను తయారు చేసే యూనిట్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఏర్పాటు చేస్తోంది. ఆర్ఐఎల్ కోసం శ్రీచక్ర ఎకోటెక్స్ ఇండియా పీఎస్ఎఫ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. ఉపయోగించిన పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయటం ద్వారా పీఎస్‌ఎఫ్‌ను తయారు చేస్తారు. ప్రస్తుతం ఏడాదికి 200 కోట్ల పెట్ బాటిళ్లను రిలయన్స్ ఫైబర్‌గా మారుస్తోంది. తాజా ప్లాంట్‌తో ఈ సామర్థ్యం 500 కోట్ల బాటిళ్లకు చేరుతుందని వెల్లడించింది. రిలయన్స్‌తో ఒప్పందం ఒక గొప్ప అవకాశమని శ్రీచక్ర ఎకోటెక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ మిక్కిలినేని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చైర్మన్ ముఖేష్ అంబానీ ఆలోచనల మేరకు ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ఐఎల్ పెట్రో కెమికల్స్ బిజినెస్ సీవోవో విపుల్ షా తెలిపారు.






