Modi: ప్రగతికి సహకరిస్తాం.. అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్రమోదీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాష్ట్ర ప్రగతికి సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతి (Amaravati) కి ఉందని ఉద్ఘాటించారు. ‘‘ఇంద్రలోక రాజధాని పేరు అమరావతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఇది శుభసూచిక. స్వర్ణాంధ్ర విజన్‌కు అమరావతి శక్తినిస్తే.. వికసిత్ భారత్‌కు స్వర్ణాంధ్ర బలమవుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పలుమార్లు తెలుగులోనే మాట్లాడారు.
‘అమరావతి దేశానికే మార్గదర్శకంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని యువత కలలు నిజం చేసే నగరంగా నిలవబోతోంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా (లీడింగ్ సిటీ)గా అమరావతి రూపొందుతుంది. ఈ రంగాల్లో మౌలిక వసతుల కల్పనను రికార్డుస్థాయిలో పూర్తి చేసేందుకు అవసరమైన మద్దతును రాష్ట్రానికి కేంద్రం అందిస్తుంది’ అని చెప్పారు. ‘కలలు కనడమే కాకుండా, వాటిని నిజం చేసుకోవడంలో ఆంధ్ర ప్రజలు ముందుంటారు’ అని ప్రశంసించారు. మధ్యలోనూ పలుమార్లు ప్రధాని తెలుగులో మాట్లాడారు. తెలుగు మాటలతోనే తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రాభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలుగువారందరికీ అర్థమయ్యేలా… అచ్చ తెలుగులో చెప్పారు. ఇవీ ఆ వివరాలు… ‘‘తల్లి దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
‘‘అమరావతి కేవలం ఒక నగరం కాదు… అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక ప్రదేశ్‌గా మార్చే శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను అధునాత ప్రదేశ్‌గా మార్చే శక్తి’’… అని తెలుగులో మరోమారు ఉద్ఘాటించారు. మధ్యలోనూ పలుమార్లు తెలుగులో మాట్లాడారు. తెలుగు మాటలతోనే తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రాభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలుగువారందరికీ అర్థమయ్యేలా… అచ్చ తెలుగులో చెప్పారు. ఇవీ ఆ వివరాలు… ‘‘తల్లి దుర్గా భవానీ కొలువైన ఈ పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందంగా ఉంది’’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘అమరావతి కేవలం ఒక నగరం కాదు… అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక ప్రదేశ్‌గా మార్చే శక్తి. ఆంధ్రప్రదేశ్‌ను అధునాత ప్రదేశ్‌గా మార్చే శక్తి’’… అని తెలుగులో మరోమారు ఉద్ఘాటించారు.
‘‘రూ. 60 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు.. వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదిగా మారబోతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ‘అమరావతి అంటే ఒక సంప్రదాయం, పురోగతితో కలిసి నడిచే భూమి.. బౌద్ధ వారసత్వపు శాంతితోపాటు.. వికసిత భారత్‌ను నిర్మించుకోగల శక్తి అమరావతికి ఉంది. కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్‌కు నాంది’ అని చెప్పారు.
‘‘2015 సంవత్సరంలో ప్రజా రాజధానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. గత కొన్నేళ్లుగా కేంద్రం అమరావతికి అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది. మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రహాలు అనుకూలించాయి. అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ సహా వివిధ భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తున్నాం’ అని మోదీ వివరించారు.
చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు
‘‘టెక్నాలజీ నాతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకున్నా. అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా.. త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్దపెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్నిరకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు అందిస్తుంది’’ అన్నారు.
‘‘ఎన్టీఆక్ వికసిత ఏపీ కోసం కలలుగన్నారు. మనందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్‌కు ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలి. పవన్ కల్యాణ్ ఇది మనం చేయాలి. మనమే చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం రూ.వేల కోట్లు సాయం చేస్తోంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు. ఒక స్వప్నం సాకారాం కాబోతోందనే భావన కలుగుతోంది. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా. ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కాదు. ఏపీ ప్రగతి, ఆశలు, వికసిత్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు. వీరభద్ర స్వామి, అమరలింగేశ్వరస్వామి, తిరుపతి వెంకటేశ్వరస్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు, చంద్రబాబు, పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా’’ అన్నారు.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని అధునాతనప్రదేశ్‌గా మార్చే శక్తి అమరావతి. యువత కలలు సాకారమయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి మారుతుంది. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సహకరిస్తుంది’’ అని చెప్పారు.
‘‘ఏపీలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలవుతుంది. రైల్వే ప్రాజెక్టులతో ఒక జిల్లానుంచి మరో జిల్లాకు, మరో రాష్ట్రానికి అనుసంధానం పెరుగుతుంది. ఈ అనుసంధానం తీర్ధయాత్రలకు పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు రైల్వేబడ్జెట్ రూ.900 కోట్లలోపే ఉండేది. ఇప్పుడు కేవలం ఏపీకే రూ.9వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం. ఏపీకి గతంకంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించాం. గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జ్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. సిమెంట్, స్టీల్, రవాణా రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాజెక్టులవల్ల వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైతులకు పథకాలు, పరిహారం కింద రూ.17 వేల కోట్లు సాయం చేశాం. పోలవరం త్వరగా పూర్తి చేసేందుకు కలిసి పనిచేస్తాం. ప్రతి ఎకరానికీ నీరు ఇచ్చేందుకు కృషిచేస్తాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
‘పలు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంటూ.. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదలు, యువత అభివృద్ధి చెందాలన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే మహిళలు, కార్మికులు అభివృద్ధి చెందాల న్నారు. ఈ నాలుగు వర్గాలు నాలుగు స్తంభాలు లాంటివారని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. నాగాయ లంకలో టెస్టింగ్ రేంజ్.. భారత రక్షణ రంగానికి శక్తినిస్తుంది. శ్రీహరికోట నుంచి ప్రయోగించే ప్రతి రాకెట్ కోట్లాది భారతీయులకు గర్వకారణం. భారత శక్తి అంటే కేవలం మన ఆయుధాలే కాదు.. మన ఐక్యత కూడా. విశాఖలో యునిటీమాల్ అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
‘‘విశాఖలో జూన్ 21న జరగనున్న యోగా డేలో పాల్గొంటాను. నన్ను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాల. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే 50 రోజులూ ఏపీలో యోగాకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఏపీలో కలలు కనేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఆ కలల్ని నిజం చేసేవారి సంఖ్యా తక్కువకాదు. ఏపీ సరైన మార్గంలో నడుస్తోంది. సరైన వేగంతో ముందుకెళ్తుంది. దీన్ని కొనసాగించాలి. మూడేళ్లలో అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని సీఎం అన్నారు. ఆ పనులు పూర్తయ్యాక ఏపీ జీడీపీ ఏస్థాయికి వెళ్తుందో నేను ఊహించగలను. అది ఏపీ రాష్ట్రం చరిత్ర గతిని మార్చబోతోంది. ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తాను. అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
సమావేశంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉప ముఖ్యమంత్రి కె పవన్‌కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్త, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాజధాని సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.