FNCA-Malaysia ఆధ్వర్యములో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్ – మలేసియా ఆధ్వర్యములో బతుకమ్మ సంబరాలు (Bathukamma) ఘనంగా జరిగాయి, మలేషియా కౌలాలంపూర్ లోని కృష్ణ మందిరంలోని బృందావన్ హాల్, బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణలో, రంగు రంగుల పూలతో చేసిన బతుకమ్మలను అందముగా పేర్చి బతుకమ్మ అట పాటలతో సందడి చేసారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా మెంబెర్ అఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పెరాక్ స్టేట్ శ్రీమతి వాసంతి సిన్ని సామి, ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణి నారాయణన్ గారు, వారితో పాటుగా తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్, కోశాధికారి నాగరాజు, మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ ప్రెసిడెంట్ శారదా, భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ ప్రెసిడెంట్ గీత హజారే, భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు, తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు.
ముఖ్య అతిథులు శ్రీమతి వాసంతి సిన్ని సామి ఈ సందర్భంగా మాట్లాడుతూ, మలేషియాలో భారతీయ వారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణి నారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు. అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు.
ఈ సంవత్సర ఉత్సవాలు ఈ క్రింది విశేషాలతో మరింత ప్రత్యేకమయ్యాయి:
అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడింది.
బతుకమ్మలు తీసుకొచ్చిన అందరు పాల్గొనేవారికి వెండి నాణేలు బహుమతిగా అందించబడ్డాయి.
ఉత్సవాల్లో పాల్గొన్న అన్ని మహిళలకు వెండి బహుమతులు.
మలేషియా అంతటా ఉన్న తెలుగు రెస్టారెంట్లు ఉదారంగా స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించబడ్డాయి.
ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ , తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించిన స్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ నవీన్ కుమార్, టూట్కర్ సొల్యూషన్స్ జగన్, సెంట్రల్ స్పైస్ నజీమ్, టెక్ మ్యాట్రిక్స్ స్టాలిన్, ఎబెనేజెర్, రెడ్‌వేవ్ సొల్యూషన్స్ జగదీశ్, టెక్‌డార్ట్ సందీప్, స్ప్రౌట్ అకాడమీ, బిఆర్ఎస్ మలేషియా అరుణ్, జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ రవి కుమార్, లులు మనీ, బిగ్ సి వెడ్డింగ్ కార్డ్స్, శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి, మై బిర్యానీ, శ్రీ బిర్యానీ, స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81, MY81, మెరిడియన్, ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు, స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని, ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి, రజిని పాల్గొన్నారు.