Amaravati: రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన నిర్మలా సీతారామన్
• ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం
• దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు
• నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు
• అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది
• ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్‌యూ సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయి
• 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయం
• రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు
• బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం బాధ్యత
• బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దు. దానిని మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలి
• 25 కోట్ల మందిని ఇప్పటి వరకూ దేశంలో దారిద్ర్యరేఖ నుంచి బయటకు వచ్చారు
• మధ్యతరగతి ఆస్పిరేషన్స్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి
• రైతులు దేశానికి పౌష్టికాహారం అందిస్తున్నారు.
• మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ఢిల్లీ , ముంబై లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయి
• అలాగే ఇతర పంటలకూ ఈ తరహా మార్కెటింగ్ సౌలభ్యాలు ఉంటే వారికి ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి
• ఏపీలోని రాయలసీమలో ఉన్న 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలి
• కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణం ద్వారా ఇది సరిపోదు.
• ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి
• భవిష్యత్ ఆలోచనలు, సమీకృత ఐడియాలను బ్యాంకులు కలిగి ఉండాలి.
• గతంలో మహిళల్ని బీమా ఏజెంటుగా మార్చేందుకు మహిళా సఖి పేరిట కార్యక్రమం ప్రారంభిస్తే అద్భుత ప్రయోజనాలు వచ్చాయి
• ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ తక్షణం అమోదిస్తారు.
• విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు
• క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణ పొందేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
• కేవలం ఐటీ గురించే కాదు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోంది.
• ఏపీ ప్రభుత్వంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ ఇవాళ ఒప్పందం చేసుకోవటం సంతోషకరం
• ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ కేపిటల్ నగరం అవుతుంది. అమరాతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని కోరుతున్నా
• ఆచార్య నాగార్జునుడు లాంటి శాస్త్రీయ పరిశోధకులు నివసించిన ప్రాంతం ఏపీ
• రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో కూడా ఏపీ పనిచేయాలని కోరుతున్నాను.






