Nara Lokesh: కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా : మంత్రి లోకేశ్
దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అమరావతి (Amaravati)లో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసింది. మూడు రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఒక్క వ్యక్తి నివాసానికి రూ.700 కోట్లు పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందుకెళ్లాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని ఆనాడు పోరాటం చేశాం. జై అమరావతి అన్నందుకు రైతులపై కేసుటు పెట్టారు. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం చూశాం. సుమారుగా 3 వేల మంది రైతులపై ఆనాడు కేసులు పెట్టారు. రాజధాని కోసం స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి నిర్మలా సీతారామన్. ఆమె పార్లమెంట్లో (Parliament) ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానం చెబుతారు. వరుసగా 8 కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆమె జీవితం మనకు ఒక పాఠం అని అన్నారు.






