Jubilee Hills: త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కి బుద్ధి చెప్పాలి: మాధవరం కృష్ణారావు

గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి (Lakshma Reddy) తో కలిసి ఆయన ఎర్రగడ్డలో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎవరికైనా పెంచిన పింఛన్లు వచ్చాయా అని ప్రశ్నించారు. మహిళలకు 2500, విద్యార్థినులకు స్కూటీలు, ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం వంటి అమలు కాని ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని అన్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో ఎక్కడ చూసినా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గతంలో ఇచ్చిన హామీలపై నిలదీయాలని ప్రజలకు సూచించారు.