High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు

జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ దొనాడి రమేశ్, జస్టిస్ సుభేందు సామంత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) కు బదిలీ అయ్యారు. వీరి బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) ఆమోదముద్ర వేశారు. గుజరాత్ హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ (Manavendranath Roy) , అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రమేశ్ తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (మాతృ హైకోర్టు) వస్తున్నారు. కోల్‌కతా హైకోర్టు నుంచి జస్టిస్ సుభేందు సామంత రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ముగ్గురి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది.