kavitha: సామాజిక చైతన్యం కోసమే … జాగృతి జనం బాట : కవిత

సామాజిక చైతన్యం కోసమే జాగృతి జనం బాట యాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (kavitha) అన్నారు. హైదరాబాద్‌లో యాత్ర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. పోస్టర్‌పై తెలంగాణ తల్లి (Telangana Thalli) , ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) చిత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దారులు వేరైనప్పుడు కేసీఆర్ (KCR) ఫొటో వాడటం సరికాదని భావించినట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బాగుంటుందనే అనేక మంది ప్రాణత్యాగం చేశారన్నారు. నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా తెలివైన వాళ్లని, వారికన్నీ తెలుసని చెప్పారు. యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామన్నారు.