Balasaraswati: తొలి తెలుగు గాయని బాలసరస్వతి కన్నుమూత

తెలుగులో తొలి నేపథ్య గాయని (Singer) రావు బాలసరస్వతి (Balasaraswati) (97) కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1928లో జన్మించిన బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ చిత్రం (Sati Anasuya movie) లో తొలి పాటను ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు.