Dude: ‘డ్యూడ్’ కథ చాలా కొత్తగా, ఎంగేజింగ్ గా ఉంటుంది – నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్

లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ (Dude) తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 10 ఏళ్లలో ఇలాంటి సినిమా చేయాలనేది మా డ్రీమ్ అన్నారు. ఈ సినిమాలో ఉన్న అంత స్పెషల్ ఏమిటి?
-ఇలాంటి సినిమా రాలేదు అనే ఉద్దేశంతో చెప్పడం కాదు. అనుకున్న బడ్జెట్లో అనుకున్న సమయంలో ప్రాసెస్ అంతా చాలా హ్యాపీగా జరిగిన సినిమా ఇది. అదే సమయంలో ప్రాఫిటబుల్ వెంచర్. సినిమా బడ్జెట్లో జరిగింది. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏ కంటెంట్ చూసిన అద్భుతంగా ఉండేది.
– తెలుగులో కూడా మేము అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ తో తీసిన సినిమాలు ఉన్నాయి. మత్తు వదలరా, చిత్రలహరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు అనుకున్న సమయంలోనే అయ్యాయి.
ఈ సినిమా ఎలా ఉండిపోతుంది?
-ఇది డిఫరెంట్ లవ్ స్టోరీ. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. అలాగే ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. మనం సెకండ్ హాఫ్ గెస్ చేస్తుంటాం. కానీ ఈ సినిమా గెస్సింగ్ కి భిన్నంగా వుంటుంది. మంచి క్వాలిటీ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది .
– డైరెక్టర్ గారు చెప్పిన కథకంటే 20% అన్హెన్స్ చేసి తీశారు. సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా అందరికీ కరెక్ట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఉంది.
లాస్ట్ 20 మినిట్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని వినిపిస్తుంది. అది తమిళనాడుకి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు?
-కథ ఎంత కావాలో అంతే మోతాదులో ఇందులో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సినిమా అందరికీ నచ్చుతుంది అందరూ ఇష్టపడతారు. డ్యూడ్ ఈ కథకు యాప్ట్ టైటిల్.
– తమిళ్ తో సమానంగా తెలుగులో ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉంది. ఇది మన ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఉండే సినిమా.
తెలుగు, తమిళ్ బిజినెస్ ని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది?
-థియేట్రికల్ గా తమిళ్లో ఎక్కువ ఉంది. ప్రదీప్ గత చిత్రం తమిళనాడులో దాదాపుగా 31 కోట్లు చేసింది షేర్ చేసింది. ఇప్పుడు దివాళి సీజన్ కూడా యాడ్ అయ్యింది. అంతే రేంజ్ టాక్ వస్తే అంతకంటే మంచి షేర్ కలక్ట్ చేస్తుంది. తమిళ్లో ఏజీఎస్ ద్వారా మేము సొంతగా రిలీజ్ చేస్తున్నాము.
మీరు హిందీలో జాట్ సినిమా తీశారు.. అది తెలుగులో ఎందుకు ప్రమోట్ చేయలేదు?
– తెలుగు ప్రమోషన్స్ కి సమయం కుదరలేదు. హిందీలో సినిమానే చాలా అద్భుతంగా ప్రమోట్ చేశారు. మా డైరెక్టర్ గారు హీరో చాలా కష్టపడే చేశారు. తెలుగులో చేయడానికి సమయం దొరకలేదు. అది మాకు మంచి వెంచర్. పార్ట్ 2 కూడా వుంటుంది.
తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా.. కథల ఎంపిక ఎలా చేస్తున్నారు?
-డీవోపీ నికేత్ గారు ఈ కథ మా దగ్గరికి తీసుకు వచ్చారు. మాకు కూడా చాలా నచ్చింది. తమిళనాడులో మాకు మంచి ఆఫీసు ఉంది. ఇప్పుడు ఒక కథ విన్నాము. అందరూ కొత్తవాళ్లుతో ఆ సినిమా చేస్తున్నాం.
మీరు చాలా సినిమాలు తీస్తున్నారు కథ ఎవరు పరిశీలిస్తారు?
-ఒక్క ముగ్గురు నలుగురు టీ ఉంది. వాళ్ళు విని అంత బాగుంది అనుకున్నాక మా దగ్గరికి తీసుకొస్తారు మేము విని డిస్కస్ చేసుకుని ఓకే అంటే ప్రొసీడ్ అవుతాం.
డ్యూడ్ ఫుల్ గా యూత్ సినిమానా?
ఇది యూత్ తో పాటు ఫ్యామిలీ కూడా చూసే కంటెంట్. డెఫినెట్ గా చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఇది సఖి లాంటి ఫ్యామిలీ మూవీ. చాలా యూత్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయి
మీరు చేసే సినిమాలన్నీ సుకుమార్ గారు చూస్తుంటారు కదా ఈ సినిమా చూశారా?
ఆయన ప్రజెంట్ ఊర్లో లేరండి. ఆయన బెస్ట్ విషెస్ మాకు ఎప్పుడూ ఉంటాయి.
హీరో ప్రదీప్ గారికి చాలా మంచి రెమినరేషన్ ఇచ్చారని విన్నాము?
– సినిమా స్టార్టింగ్ ముందు ఏ రెవెన్యూ రేషన్ అయితే అనుకున్నామో అదే ఇచ్చాము.
ప్రదీప్ గారు రెవెన్యూ రేషన్ గురించి ఆలోచించే మనిషి కాదు. ఆయన డైరెక్టర్ బైక్ లో షూటింగ్ కి వస్తున్నారని కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఒక మంచి కథని తీసుకొచ్చారని అనుకున్నది అద్భుతంగా తీస్తున్నారు అనే సంతోషంతో బహుమతి ఇచ్చారు.
ప్రభాస్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఎప్పుడు రావచ్చు?
-ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారి సినిమాలు రెండు కూడా 2026లో వస్తాయి
ప్రదీప్ గారి రెండు సినిమాలు లవ్ టుడే డ్రాగన్ తెలుగులో మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
-అంతకుముందు అతని హిట్ సినిమాలు దాదాపు 12 కోట్లు చేశాయి. ఇప్పుడు రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 15 కోట్లు చేస్తే డీసెంట్ నెంబర్ చేసినట్టు. డెఫినెట్ గా చేస్తుందని నమ్ముతున్నాము.
ప్రేక్షకుల అంచనాలను అందుకునే సినిమాలు తీయడం చాలెంజింగ్ గా అనిపిస్తోందా?
హైప్ వున్న సినిమాకి వస్తున్నారు. ఇంకొన్ని సినిమాలకి టాక్ బాగుంటే వస్తున్నారు. లేదంటే సినిమా చచ్చిపోతుంది. కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు. 50% మినిమం గ్యారంటీ ఉండేది.
రేమ్యునిరేషన్ ఎక్కువైపోయి ప్రొడక్షన్ కి డబ్బులు సరిపోవట్లేదు అనే అభిప్రాయాన్ని మీరు ఎలా చూస్తారు?
మిగతా లాంగ్వేజ్లతో పోల్చుకుంటే మనం ఆ విషయంలో చాలా బెటర్ గా ఉన్నామని భావించాలి. ప్రొడక్షన్ మీద మనం చాలా మంచి అమౌంట్ ఖర్చు చేస్తున్నాం. ఎవరికైనా సరే డిమాండ్ ను బట్టి పే చేస్తాము.
డ్యూడ్ కి ఎలాంటి అంచనాలతో రావాలి?
ప్రతి రంగనాథన్ గారి సినిమాలు ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. యూత్ ఫుల్ గా ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా అన్ని ఎమోషన్స్ మీకు కనిపిస్తాయి. ఫ్యామిలీస్ యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది.
సాయి అబ్యంకర్ మ్యూజిక్ గురించి?
తను చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్. చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తనతో ఫ్యూచర్ లో కూడా వర్క్ చేయాలని ఉంది.
పెద్ది ఎప్పుడు వస్తుంది?
-పెద్ది 2026 మార్చ్ 27 కన్ఫామ్.
దీపావళికి ఫస్ట్ లిరికల్ వీడియో వస్తుందని విన్నాం?
-దానికి కొంచెం టైం పట్టేలా ఉంది , లిరికల్ వీడియో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో చేయాలి. సాంగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది.
సుకుమార్ గారి సినిమా ఎప్పుడు ఉంటుంది?
-పెద్ది అవ్వగానే స్టార్ట్ అవుతుంది.
ఆంధ్ర కింగ్ ఎలా ఉండబోతుంది?
-సినిమా చాలా బాగా వచ్చిందండి. రామ్ గారికి చాలా డిఫరెంట్ మూవీ. డెఫినెట్ గా చాలా బాగుంటుంది.
దీపావళికి నాలుగు సినిమాలు ఉన్నాయి కదా.. ఈ కాంపిటీషన్ ఎలా చూస్తారు?
-లాస్ట్ టైం కూడా మూడు సినిమాలు వచ్చాయి. అమరన్, లక్కీ భాస్కర్, క.. మూడు సినిమాలు కూడా బాగా ఆడాయి. మేము ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ లో ఉన్నాం. అన్ని సినిమాలు బాగా ఆడాలనే కోరుకుంటాము. మేము అందరి హీరోలతోనూ పని చేస్తున్నాము. అందరి సినిమాలు కూడా అద్భుతంగా ఆడి థియేటర్స్ కళకళలాడాలని మనస్పూర్తిగా కోరుకుంటాం.