MATA: మాటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27తేదీన బతుకమ్మ & దసరా పండుగలను (Bathukamma And Dasara) ఘనంగా నిర్వహించనున్నారు. న్యూజెర్సీలోనే ఇది అతిపెద్ద బతుకమ్మ అవుతుందని మాటా ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుక ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరగనుంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ఎత్తిచూపేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రత్యేక అతిథులుగా సరిగమప 13వ సీజన్, ఇండియన్ ఐడల్ 2 ఫేమ్ యుతి హర్షవర్ధన, యాంకర్ దీప్తి నాగ్ హాజరుకానున్నారు.
ఈ వేడుకల్లో (Bathukamma And Dasara) ఒక అడుగు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న బతుకమ్మలను తీసుకొచ్చిన తొలి 25 మందికి చీర బహుమతిగా లభిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే వారు https://tinyurl.com/mata-nj-bathukamma లింక్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు . మాటా న్యూజెర్సీ (NJ) బృందం, కార్యనిర్వాహక కమిటీ, వివిధ స్పాన్సర్ల సహకారంతో ఈ సాంస్కృతిక వేడుకను అందరికీ మరపురానిదిగా మార్చడానికి కృషి చేస్తున్నాయి.