Nara Lokesh: రుషికొండలో భారీ పెట్టుబడులు: దక్షిణ భారత ఐటీ హబ్‌గా విజాగ్ ఎదుగుదలకు వేగం
విశాఖపట్నం (Visakhapatnam) ఐటీ రంగం కొత్త వేగంతో ముందుకు సాగుతోంది. రుషికొండ (Rushikonda) హిల్–2లో నిర్మించిన మహతి ఫిన్‌టెక్ టవర్‌లో కాగ్నిజెంట్ (Cognizant) తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించటం నగర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు. వెయ్యి సీట్లతో మొదలైన ఈ కేంద్రం, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందనే అభిప్రాయం ఐటీ నిపుణుల్లో కనిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ ఆరంభం దావోస్ (Davos) సందర్శనపై వచ్చిన విమర్శలకు ప్రత్యక్ష సమాధానంగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) జనవరి 23న దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓని కలిసిన తర్వాత జరిగిన పరిణామాలు ఎంతో వేగంగా జరిగాయి. జూన్ 25న పెట్టుబడులకు అనుమతి రావడం, డిసెంబర్ 12న వెంటనే కార్యకలాపాలు ప్రారంభమవడం ప్రభుత్వ పనితీరును స్పష్టంగా చూపిస్తున్నదని కూటమి నాయకులు చెబుతున్నారు.
లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతలో ఆనందం నెలకొంది. అంతర్జాతీయ సంస్థలు ఈ రీతిలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, నిర్ణయాలు తక్షణమే అమలవడం వల్లేనని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే ప్రారంభం మాత్రమే. కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరగబోతుంది. రూ.1,583 కోట్లతో నిర్మించనున్న ఈ కేంద్రం 8,000 మందికి ప్రత్యక్ష ఉపాధి ఇస్తుందని, పరోక్షంగా మరింత మందికి ఉద్యోగాలు కలిసొస్తాయని అంచనా.
కాగ్నిజెంట్, సత్వా గ్రూప్ (Sattva Group) tho పాటు మరో ఏడు ఐటీ కంపెనీల ప్రాజెక్టులకు భూమిపూజ జరగనుంది. ఇవన్నీ అమల్లోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలో కీలక ఐటీ హబ్‌గా ఎదగడంలో సందేహం లేదు. రుషికొండ హిల్–2లో శ్రీటెక్ (Sritech) నిర్వహించనున్న ఏఐ టెక్నాలజీ సెంటర్లో 2,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
హిల్–4 ప్రాంతంలో సత్వా డెవలపర్స్ భారీ ఐటీ పార్క్, డేటా సెంటర్, మరియు వాంటేజ్ వైజాగ్ (Vantage Vizag) క్యాంపస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. బెంగళూరు (Bengaluru) కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ విశాఖలో తమ మొదటి భారీ ఐటీ ప్రాజెక్ట్‌ను వేగంగా రూపొందించేందుకు సిద్ధమైంది.
కాపులుప్పాడ (Kapuluppada) ప్రాంతంలో ఇమ్మాజినోటివ్ (Imaginotive), ఫ్లూయెంట్‌గ్రిడ్ (Fluentgrid), మదర్సన్ టెక్నాలజీస్ (Motherson Technologies), క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ (Quarks Technosoft) వంటి సంస్థలు కూడా తమ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం, విశాఖలో ఐటీ వాతావరణం మరింత బలపడుతున్నదనే సంకేతం. పెట్టుబడులు, ఉద్యోగాలు, టెక్నాలజీ అభివృద్ధి—ఇన్ని మార్పులు ఒకేసారి చోటు చేసుకోవడం వల్ల విశాఖపట్నం భారతదేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఐటీ నగరాల జాబితాలో చోటు సంపాదించేందుకు సిద్ధంగా ఉంది. “అభివృద్ధి వేగం” అని కూటమి నేతలు చెబుతున్నదానికి ఈ పరిణామాలే తార్కాణం.






