Gangisetty Sivakumar:బాల సాహిత్య పురస్కారం అందుకున్న గంగిశెట్టి శివకుమార్
నెల్లూరుకు చెందిన బాలల సాహితీవేత్త, రిటైర్డు ఉపాధ్యాయులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ (Gangisetty Sivakumar) 2025 బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. తెలుగులో ఆయన రాసిన కబుర్ల దేవత పుస్తకాన్ని 2025 బాల సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించింది. ఇందులో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడి త్రివేణి కళా సంగమం (Triveni Kala Sangam) లో జరిగిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ (Madhav Kaushik) , శివకుమార్‌కు (Shivakumar) పురస్కారాన్ని అందజేశారు. కబుర్ల దేవత పుస్తకం పిల్లల్లో మానవతా విలువలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే 36 కథల సంకలనం. వినోదాత్మకంగా కూడా ఉంటుంది. ఈ ఏడాది వివిధ భాషలకు చెందిన 24 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలను అందజేశారు.






