Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక .. ఇకపై తప్పనిసరి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరని తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) స్పష్టం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ కొత్త విధానాన్ని విధిగా అమలు చేయనున్నట్లు వెల్లడిరచింది. అలిపిరి తనికీ కేంద్రం వివిధ వాహనాల్లో చేరుకొనే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలందించడం దృష్ట్యా ఆగస్టు (August) 15 నుంచి తిరుమల వచ్చే వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేస్తూ టీటీడీ (TTD) ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనికీ కేంద్రం వద్ద ఐసీసీఐ బ్యాంకు (ICCI Bank) సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది.







