Drugs: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం.. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమంలో ఈగల్ టీం ఐజీపీ ఆకే రవికృష్ణ
గుంటూరు జిల్లా, తాడేపల్లి: డ్రగ్స్ రహిత సమాజం కోసం పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఎఫ్టీపీసీ ఇండియా ఆర్గనైజేషన్, టీసీసీసీ సంయుక్తంగా విజయవాడలో “డ్రగ్స్ వద్దు బ్రో” అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఈగల్ టీం ఐజీపీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్, ప్రోటోకాల్ ఇంచార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐజీపీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలను చేపట్టిన ఎఫ్టీపీసీ ఇండియా ఆర్గనైజేషన్ వారికి, ఎఫ్టీపీసీకి ధన్యవాదాలు తెలియజేశారు.
డ్రగ్స్ మహమ్మారిపై మనమందరం కలిసి పోరాడతామని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఐజీపీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. యువత, ప్రజలందరూ ‘సే నో టు డ్రగ్స్’ అనే నినాదానికి కట్టుబడి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో తోడ్పడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్, పాతూరి నాగభూషణం గారితో పాటు, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక పోరాటం గురించి వివరించి, అందరిలో స్ఫూర్తి నింపారు.






