Chandrababu: ఏ టేల్ ఆఫ్ టు స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ప్రముఖ పాత్రికేయుడు ఐ. వెంకటరావు (I. Venkata Rao) రాసిన విలీనం విభజన పుస్తకం ఆంగ్ల అనువాదం ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆవిష్కరించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పరిశోధకులు, భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఎన్.అనురాద 9N. Anuradha)ను ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్ని పరిపాలించిన సీఎంల గురించి రచయిత ఇందులో వివరించారు. ఈ కార్యక్రమంలో రచయిత ఐ.వెంకటరావు, రచయిత, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్, పుస్తక ప్రచురణకర్తలు ఐ.వేణు, ఐ.రఘు పాల్గొన్నారు.
– NS GOUD






