CP Radhakrishnan: చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు : ఉపరాష్ట్రపతి
వ్యాపార అనుకూల రాష్ట్రం ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) అన్నారు. విశాఖపట్నం(Visakhapatnam) లో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు లో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. దేశంలో పేదరికం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కార్మిక చట్టాలు, పన్నుల్లో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మోదీ పాలనలో 11 ఏళ్లుగా దేశం ముందుకెళ్తోంది. సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. మూడు దశాబ్దాలుగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాకు స్నేహితుడు. ఆయన సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు వచ్చాయి. లక్ష్యం పెట్టుకోవడం సులువు. అక్కడికి చేరుకోవడం కష్టం. పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే పెట్టుబడులు వస్తాయి అని అన్నారు.






