Chandrababu: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే : చంద్రబాబు
మన దేశంలో నాలెడ్జ్‌కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. తిరుపతి (Tirupati)లో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయమని చెప్పారు. 1991లో ఆర్థిక సంస్కరణలు తర్వాత అత్యంత కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మన దేశంలో ప్రధాని మోదీ (Modi) నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. 2047 నాటికి ప్రపంచశక్తిగా ఆవిర్భవిస్తుంది. మన దేశం పేరు మార్మోగిపోతుంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారు. దశాబ్దకాలంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతుండగా, భారత్‌లో మాత్రమే పెరుగుతోంది. తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏర్పోసేస్ సిటీ, విశాఖలో మెడ్‌టెక్ పార్కు తీసుకొస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక వేతనాలను భారతీయులు పొందుతున్నారు. గతంలో హైదరాబాద్‌లో ఐటీని ప్రోత్సహించా, దీనితో ప్రపంచంలో తెలుగువారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ వచ్చింది అని పేర్కొన్నారు.






