Revanth Reddy: క్రైస్తవులకు సీఎం రేవంత్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని క్రైస్తవ మతపెద్దలు, చర్చిఫాదర్లు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు ప్రపంచ మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని కొనియాడారు. క్రీస్తు బోధనలను అనుసరిస్తూ, రాష్ట్రంలోని అన్ని మతాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పా రు. ముఖ్యంగా క్రైస్తవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. వేడుకలను ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ (Mohammed Azharuddin) ,ఎంపీ మల్లురవి పాల్గొన్నారు.






