Chandrababu: తెలుగుదేశం పార్టీకి కోడెల ఎనలేని సేవలు : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నవాంధ్ర తొలి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (Kodela Sivaprasada Rao) వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) నివాళులు అర్పించారు. రూపాయి డాక్టర్‌గా పేద ప్రజలకు ఆయన వైద్యసేవలు అందించారని గుర్తు చేశారు. పల్నాడు (Palnadu) ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారన్నారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజాసంక్షేమానికి, పల్నాడు ప్రగతికి, తెలుగుదేశం పార్టీకి కోడెల ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.