Chandrababu: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), నారాయణ (Narayana), పయ్యావుల హాజరయ్యారు. అమరావతి (Amaravati)లో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మొదటి బ్లాక్లో కార్యక్రమం నిర్వహించనున్నారు. అమరావతిలో ఇప్పటికే వివిధ బ్యాంకుల యాజమాన్యాలు కార్యాలయాలు నిర్మించే ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి.






