Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో ప్రకటించిన పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు విజ్ఞప్తి చేశారు. నవంబరులో విశాఖపట్నం (Visakhapatnam) లో జరిగే సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు సన్నాహక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢల్లీికి వచ్చిన సీఎం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. దేశంలోని తూర్పుభాగాన ఉన్న రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో బిహార్, రaార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను చేర్చింది. ఈ నేపథ్యంలో పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి తాము ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు ఆర్థిక మంత్రికి విరించారు. రాయలసీమలో హార్టీకల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ, జీడీ, కొబ్బరితోటలు, కోసాంధ్రలో ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు తయారుచేసినట్లు వివరించారు. వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పూర్వోదయ నిధులు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) , రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశమ్ (Payyavula Kesham) , బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారు.