Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్

ప్రభుత్వ పాఠశాలలకు కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులు విరాళం
ఉండవల్లిః డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్ కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. సుమారు 40 లక్షల విలువైన నోట్ పుస్తకాలు, పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాల ట్రక్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా టెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కే.ప్రీతమ్ రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.