Chandrababu: పథకాలతో మాత్రమే సరిపోవు, సమస్య పరిష్కారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి – చంద్రబాబు

దక్షిణాది రాష్ట్రాలు ప్రజలకు నేరుగా నిధులు అందించే పథకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఒక రాష్ట్రం చేస్తే, మరొక రాష్ట్రం .. ఒక పార్టీ ఇచ్చిందని మరొక పార్టీ.. ఇలా ఉన్న పథకాలు చాలవని కొత్త పథకాలతో ముందుకు వస్తోంది. కానీ, ఈ పథకాలు నిజంగా ప్రజలకు సంతోషం ఇస్తున్నాయా అనే ప్రశ్న ఎల్లప్పుడూ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే, ప్రతిసారి ఎన్నికల సమయానికి ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఎన్ని పథకాలు అమలు చేసినా, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించకపోవడం, కేవలం .. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు మేము మాత్రమే ఇచ్చాము.. అని ప్రకటించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ పరిస్థితి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (Y.S. Jagan Mohan Reddy) నవరత్నాల (Navaratnas) పథకాలను అమలు చేసి ప్రజల పరిస్థితిని మెరుగుపరిచారని వెల్లడించారు. కానీ, అదే సమయంలో క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకపోవడం కారణంగా, పార్టీకి ప్రజల మద్దతు పరిమితం అయింది. రహదారుల సమస్యలు, సుదీర్ఘకాలం పరిష్కారం లభించని పెండింగ్ వర్క్స్ , నేతలు కేవలం పదవులకు పరిమితం అవడం ప్రజలతో సరిగ్గా కలవకపోవడం వల్ల పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
ప్రస్తుతం, అదే పరిస్థితి కూటమిలో కూడా కాస్త కనిపిస్తోంది. అయితే కూటమి కొంతమేర భిన్నంగా ఉన్నా, పెద్దగా చెప్పినంత అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. గతంలో జగన్ (Jagan) తన విధానంలో తాను నిర్ణయించిన విధంగా వ్యవహరించేవారని, కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తేడాలను గుర్తించి మార్పుల దిశగా ఆలోచిస్తున్నారని వారు చెప్పుతున్నారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిలో ప్రజల సంతృప్తిని ప్రధానంగా పరిశీలిస్తున్నారని, అవసరమైతే వెనక్కి తగ్గడం ద్వారా సమస్యలను పరిష్కరించగల నాయకుడిగా గుర్తింపు పొందారనీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక లబ్ధులు అందించే అనేక పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా అప్పులు ఇవ్వడం, సూపర్ సిక్స్ (Super Six) పథకాలను ప్రారంభించడం, ప్రతి నెల పింఛన్ టైంలో నేతలు స్వయంగా ప్రజలతో మమేకం అవ్వడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అయితే, క్షేత్రస్థాయిలో సమస్యలు ఇప్పటికీ పరిష్కరించబడకపోవడం ప్రజలలో అసంతృప్తి కలిగిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో, చంద్రబాబు పథకాలను ఇవ్వడమే కాకుండా, సమస్యలను కూడా పట్టించుకోవడం అత్యంత అవసరమని తెలుసుకున్నారు. కాబట్టి, ప్రభుత్వం ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం మరింత దృష్టి పెట్టింది. ఈ విధాన మార్పు ప్రజలకు ఎంతమేర సంతృప్తి ఇస్తుందో రాబోయే కాలంలోనే స్పష్టమవుతుంది.