Tilak Verma: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ

ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Verma) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన తిలక్‌ను రేవంత్‌రెడ్డి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి తిలక్ వర్మ క్రికెట్ బ్యాట్ (Cricket batను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవీ తదితరులు పాల్గొన్నారు.