Bathukamma: బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లో జరిపిన బతుకమ్మ(Bathukamma) వేడుకలకు గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డు (World Records) దక్కిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ని కలిశారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసిన ఆయన గిన్నిస్‌బుక్ రికార్డును ఆయనకు అందించారు. ఈ ప్రతిష్టాత్మక రికార్డు దక్కడంపట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి జూపల్లిలతోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan), టూరిజం శాఖ ఎండీ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.