Komatireddy : యాదన్నా .. కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినవే!

యాదన్నా ఎందుకు వచ్చినవే కాంగ్రెస్‌లోకి. ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు. అనవసరంగా వచ్చావు అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (kale yadaiah) ను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళుతున్న రాజగోపాల్‌రెడ్డికి చిలుకూరు లోని పెద్దచెరువును పరీశిలిస్తున్న యాదయ్య ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పార్టీలోకి ఎందుకొచ్చారంటూ చేసిన రాజగోపాల్‌రెడ్డి అనడంతో యాదయ్య చిరునవ్వు నవ్వారు.