Nara Lokesh : స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్రాభివృది : మంత్రి లోకేశ్

స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సీఐఐ (CII) సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad airport) అన్ని వేల ఎకరాలు ఎందుకుని ఆనాడు చంద్రబాబు (Chandrababu ) ను అందరూ అడిగారు. ఇప్పుడు తెలంగాణలో జీడీపీలో 11 శాతం శంషాబాద్ విమానాశ్రయం నుంచే వస్తోంది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ (Google data center) వస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో పరిపాలన చూసే కేంద్రం అండగా ఉంటోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవ్తేతలను ఆహ్వానిస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు దిశగా వెళ్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టగలిగాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.