Chandrababu: ఆయన వైఖరి ఏలాంటి తో ప్రజలకు తెలిసిందే : చంద్రబాబు

పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan)లో సీఎం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ద్వారా పలువురికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ హయాం నుంచి పులివెందుల (Pulivendula)లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంతో జగన్ (Jagan) ఉన్నారు. ఆయన వైఖరి ఏలాంటితో ప్రజలకు తెలిసిందే. నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు పోలింగ్ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా? శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి. కనుకే ప్రజలు దైర్యంగా ఓటేశారు అని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరమన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.