Chandrababu: ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి చంద్రబాబు.. కుప్పం నుంచి ఇంటింటి ప్రచారం షురూ

ఆంధ్రప్రదేశ్‌లో (AP) కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తైన సందర్భంగా, ప్రజల్లోకి వెళ్లి పాలనలో సాధించిన విజయాలను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా “ఇంటింటి ప్రచారం” కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.
ఈ ప్రచారాన్ని సీఎం, తన నియోజకవర్గమైన కుప్పం (Kuppam) నుంచే ఈ కార్యక్రమాన్ని జూలై 2వ తేదీన ప్రారంభించనున్నారు. చిత్తూరు జిల్లాలోని (Chitoor Zilla) శాంతిపురం (Shanthipuram) మండలానికి చెందిన తిమ్మరాజుపల్లి గ్రామంలో (Thimarajupalli village) ఉదయం 8 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో ముచ్చటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై వారికి వివరించనున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఈ ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది. అనంతరం తుమ్మిసి ప్రాంతంలోని ఏపీ మోడల్ స్కూల్ (AP Model School) వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ఉదయం 10:55 గంటలకు పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలు, రాబోయే కార్యాచరణపై ప్రజలకు సమగ్రంగా వివరించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో (Kuppam Government Hospital) టాటా డిఐఎన్సి (Tata DiNC) సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కేంద్రం ప్రారంభంతో ఆరోగ్య సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తాయని అంచనా. అనంతరం సాయంత్రం 4:20 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటైన హెలిప్యాడ్‌కు చేరుకుని, అమరావతి (Amaravati)కి తిరుగు ప్రయాణం చేపడతారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు పై నెగెటివ్‌గా ఉండటంతో, ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం చేస్తున్న పని గురించి ప్రత్యక్షంగా వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచేందుకు ఇది మంచి అవకాశం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.