CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రముఖుల హాజరు
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)కు మొదటిరోజున ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ప్రారంభించారు. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సీఎస్ విజయానంద్, సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి తదితర దిగ్గజ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు. 522 మంది విదేశీ ప్రతినిధులు, 72 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. 2,500 మంది పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.






