Jagan: టీడీపీ కు ప్లస్.. వైసీపీ కు మైనస్..ఆ ఒకటే..

రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే కేవలం పనిచేయడమే కాదు, ప్రజల మధ్య బలమైన గళాన్ని వినిపించడం కూడా చాలా అవసరం. ఈ అంశాన్ని టీడీపీ (TDP) బాగా అర్థం చేసుకుంది. వైసీపీ (YCP) పాలనలో జరిగిన ప్రతి విషయాన్ని టీడీపీ ప్రజల మధ్య చర్చకు తీసుకొచ్చింది. తప్పు అన్న ప్రతి విషయంపై బలంగా తమ గళాన్ని వినిపించి ప్రజలలో మార్పుకు శ్రీకారం చుట్టింది..అది కూడా ఓ రాజకీయమే. ఇలా ప్రజలలో ముద్ర పడేలా ఒక ఆలోచనను బలంగా ప్రతిపాదించగలగడం రాజకీయాలలో చాలా కీలకం.
జగన్ (Jagan) పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన చెబుతుండగా, అవి ప్రజల్లోకి బలంగా వెళ్లడం లోపించింది. పార్టీ నేతల మాటల్లోనే, వారు చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారు. పేర్ని నాని (Perni Nani) నుంచి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) వరకు పలువురు నేతలు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయినప్పుడు తిరిగి అదే స్థాయికి రావడానికి పార్టీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ప్రస్తుతం వైసీపీ కూడా అదే దశను ఎదుర్కొంటోంది.
ప్రజల్లో విశ్వాసం పొందాలంటే, అన్ని వర్గాల మాట వినగలగడం, వారితో సంబంధం పెట్టుకోవడం, వాటిపై బలమైన వాదన వినిపించడం అవసరం. అలాంటి నైపుణ్యాలున్న నాయకుల కోసం వైసీపీ వెతకడం మొదలుపెట్టింది. బలమైన వాఖ్యాలు చేయగల నాయకులను ముందుకు తీసుకురావాలనే యత్నం చేస్తోంది. అయితే టీడీపీ మాత్రం ఇదే పనిని ఎప్పుడో ప్రారంభించి, మంచి నాయకులను ఎదుగుదలకు ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళా నాయకులపై ఎక్కువ దృష్టిపెట్టడం ద్వారా ప్రజల్లో ఒక కొత్త మూడ్‌ను సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా కావలి గ్రీష్మకు (Kavali Greeshma) ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం కూడా ఆమెలోని బలమైన వాఖ్యశక్తిని గుర్తించి తీసుకున్న నిర్ణయమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ మాత్రం , “మనలో ఎవరు ఇలా మాట్లాడగలరు?” అనే దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజానికి వైసీపీలో నాయకుల కొరత లేదు, కానీ ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడే శైలి లోపించిందన్నది స్పష్టమవుతోంది. కావున పార్టీకి అవసరమైన మార్పు ఇది. నాయకులను ముందుకు తీసుకురావడమే కాదు, వారి మాటల్లో పద్ధతిని, ప్రభావాన్ని నేర్పించడమే ప్రధానంగా మారాలి. తద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ పొందగలుగుతుంది. జగన్ త్వరగా ఈ విషయంపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది..