కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‍తో .. మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‍తో ఆంధప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గున రాజేందర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై ఆయన కేంద్ర మంత్రితో చర్చించారు. భేటీ అనంతరం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రాబడి తగ్గిపోయిందని, అందు వల్లే రాష్ట్రం అప్పులు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయారని, వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. కరోనా చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం సవరించిన అంచనా వ్యయానికి కేంద్రం ఆమోదం పోగ్రెస్‍లో ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి బుగ్గనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు.