పెట్టుబడులకు ఏపీ అనుకూలం.. దుబాయ్ ఎక్స్ పోలో మంత్రి మేకపాటి

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు.దుబాయ్‌లో నిర్వహించిన దుబాయ్ ఎక్స్‌పోలో ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను ఆచరణలో చూపిస్తోందని తెలిపారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వ్యవస్థలను నెలకొల్పి ప్రతి పౌరునికి ప్రభుత్వం నుండి సేవలను, సరఫరాలను ఇంటి ముందుకు చేరుస్తోందని వెల్లడిరచారు. సమర్థవంతమైన పాలన, స్థానికంగా అపార వనరులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, వాణిజ్యపరంగా సానుకూల వాతావరణం, నైపుణ్య మానవ వనరులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరంగం ఊహించని అభివృద్ధిలో ఉందన్నారు. ఆటోమొబైల్, టెక్స్‌టైల్, వైద్య, ఐటీ, ఆహారశుద్ధి రంగాల్లో అనేక పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానమని తెలిపారు.
రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణంపై ఏపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని వ్యాఖ్యానించారు. వైజాగ్`చెన్నై, చెనై` బెంగళూరు, హైదరాబాద్`బెంగళూరు వంటి మూడు పారిశ్రామిక కారిడార్లు ఏపీలో ఉన్నాయని వివరించారు. విశాఖపట్నం, అనంతపురం, కాకినాడ, కృష్ణపట్నంలో నాలుగు లాజిస్టిక్ పార్కుల నిర్మాణానికి కార్యాచరణ, తద్వారా చౌకైన సరుకు రవాణా వ్యవస్థను నెలకొల్పే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం, 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మించి మత్స్య ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగాల్లో పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి తన్‌బిన్ అహ్మద్ ఆల్ జియాది, భారత్‌లో సౌదీ రాయబారి అహ్మద్ అబ్దుల్ రెహమాన్, యూఏఈలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, మధ్య ఆసియా పెట్టుబడుల సలహాదారు జుల్ఫీ, ఏపీఐఐసీ చైర్మన్ మొట్టు గోవిందరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం పాల్గొన్నారు.