30న ఏపీ మంత్రి మండలి.. సమావేశం

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన మంత్రి మండలి సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్‍లో ఉన్న కేబినెట్ హాల్‍లో ఈ సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు తెలిపారు.