Satya Prasad: వారికి కూడా ఏపీ ప్రభుత్వం సాయం : మంత్రి అనగాని
నేడు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చరిత్రాత్మక రోజు అని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ (Satya Prasad) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికి సొంతిల్లు ఉండాలన్న ఎన్టీఆర్ (NTR) ఆశయాన్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) దూరదృష్టి వల్ల 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నట్లు వివరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా నిర్మాణంలో జాప్యం లేకుండా పూర్తి చేసినట్లు తెలిపారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి కూడా ఏపీ ప్రభుత్వం సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. 2029 నాటికి ప్రతి అర్హుడిక పక్కా ఇల్లు ఇవ్వడం తమ లక్ష్యమని తెలిపారు. పేదలందరికీ ఇళ్లని చెప్పి సెంటూ పట్టా పేరుతో జగన్ (Jagan) భారీ దోపిడీకి తెరలేపారని విమర్శించారు. పేదవాడి ఇంటికి సెంటు స్థలమే ఇచ్చిన ఆయన మాత్రం విలాసవంతమైన ప్యాలెస్లో సేదతీరారని దుయ్యబట్టారు.







