Srujan: ఓం శాంతి శాంతి శాంతిః అందరూ రిలేట్ అయ్యే మంచి కమర్షియల్ ఫ్యామిలీ మూవీ- నిర్మాత సృజన్ యరబోలు
మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సృజన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ కథతో మీ జర్నీ ఎప్పుడు మొదలైంది?
-నాకు యూఎస్ లో ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూడటం అలవాటు. దాదాపు అన్ని భాషల సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా చూసిన మరుక్షణమే ఇది తెలుగులో బాగా వర్క్ అవుట్ అవుతుందని పించింది. అప్పటికి నేను మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా హీరో ద్వారా బాసిల్ జోసెఫ్ నెంబర్ తీసుకుని నిర్మాతలతో మాట్లాడాను. వెంటనే రీమేక్ రైట్స్ తీసుకున్నాను.
మిమ్మల్ని అంతలా ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి?
-చిన్నప్పుడు నుంచి ఊర్లో కనిపించిన పాత్రలు అనిపించాయి. అమ్మాయిలపై చేయి చేసుకోవడం చూస్తుంటాం. కానీ వాళ్లు రివర్స్ అయితే పరిస్థితి ఏమిటి అనే పాయింట్ నాకు చాలా నచ్చింది. ఆ సినిమా చూస్తున్నప్పుడు తెలుగు సెన్సిబిలిటీస్ కి ఎలా మార్చుకోవచ్చు అన్నది ఆలోచించుకున్నాను. ఓటిటిలో తెలుగు డబ్బింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమాని ఇంకా చాలామంది ఆడియన్స్ చూడలేదు. అయితే చూసినవాళ్లు కూడా ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి.. దాన్ని ఎలా చేయాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం. అది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. కథపరంగా మార్కులు ఉండవు కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం.
ఈషా ఎంతవరకు తన పాత్రకు జస్టిఫికేషన్ చేశారు?
-దర్శనతో తనకి పోలికే ఉండదు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనదైన నటన కనబరిచింది. తన కెరీర్ లో గుర్తిండిపోతుంది.
తరుణ్ భాస్కర్ గారిని కేవలం నటుడుగానే అడిగారా?
-నిజానికి తరుణ్ ని డైరెక్షన్ కూడా అడిగాను. అయితే తను రీమేక్స్ చేయనని చెప్పారు. కేవలం నటుడు గానే కొనసాగుతానని మొదటి నుంచి చాలా క్లియర్ గా చెప్పారు.
-తరుణ్ ఇందులో గోదారి యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తన యాస అద్భుతంగా కుదిరింది
డైరెక్టర్ సజీవ్ గురించి?
35 చిన్న కథ కాదు చేస్తున్నప్పుడు తను అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడ తన వర్క్ చూశాను. నాకు కొత్త దర్శకులతో పని చేయడం ఇష్టం. తనకి ఫోన్ చెప్పిన వెంటనే చేస్తానని చెప్పాడు. తనదైన ఒక తనదైన వెర్షన్ లో ఒక కథ రాశాడు. అది నాకు చాలా నచ్చింది.
షూటింగ్ ఎక్స్పీరియన్స్?
షూటింగ్ అంతా గోదావరి ప్రాంతంలో చేశాం. దర్శకుడు కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. షూటింగ్ ఎలా చేయబోతుందని ఎలా చేయబోతున్నాం అనేది పూర్తిగా పేపర్ మీద ఉంటుంది. నేను యూఎస్ లో ఉంటాను కాబట్టి షూటింగ్ కి వెళ్లడం కుదరలేదు.
-జై క్రిష్ మ్యూజిక్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఈ సినిమా తర్వాత తనకు చాలా మంచి అవకాశాలు వస్తాయి.
ఈ సినిమాపై మీ అంచనాలు ఏమిటి?
మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చెప్పాను. అందరూ సినిమాని రీమేక్ అంటున్నారు. నిజానికి రీమేక్‌లు మనకి ఎప్పటినుంచో అలవాటు. రామాయణం కథని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాను. ఉదాహరణకు రాజమౌళి గారు రామాయణం తీస్తే ఇది రీమేక్ అని మనం అనలేం కదా.. ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాగే ఈ కథ కూడా ప్రతి ఇంట్లో జరిగే కథ. ఇంటింట రామాయణం. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే కథ. తెలుగుకి తగ్గట్టుగా ఒరిజినల్ ఫిలిం తీశాము. 35 కంటే చాలా ఎంటర్టైన్మెంట్. చాలా ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు.
నిర్మాతగా మిమ్మల్ని నడిపించే శక్తి?
నాకు సినిమాలంటే చాలా పాషన్. ఇక్కడ నిర్మాతగా సంపాదించుకున్నది ఏమీ లేదు అలా అని పెద్దగా పోగొట్టుకున్నది లేదు. ప్రతిదీ బ్రేక్ ఈవెన్ అవుతూ వస్తున్నాను. ఒక సినిమాలో వచ్చింది మరో సినిమాలో పెడుతున్నాను.
ఈ సినిమాలో మీతో పాటు మరికొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా? ఆ జర్నీ?
జర్నీ చాలా సాఫీగా జరిగింది. మా మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ లేవు. క్రియేటివ్ గా ఏదైనా నేనే హ్యాండిల్ చేస్తానని మొదటి నుంచి క్లియర్ గా తెలుసు.
-మలయాళం లో కంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మలయాళం వర్షన్ చూడని వాళ్ళకి ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాలా అనిపిస్తుంది. చూసిన వారికి సర్ ప్రైజ్ గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తుకు రాదు. ప్రిమియర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
-మొదటినుంచి నేను కంటెంట్ సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు కంటెంట్ కమర్షియల్ సినిమాలపై దృష్టి పెట్టాను. 35 చిన్న కథ కాదు కమర్షియల్ సినిమానే. ఈ సినిమా కూడా అందరికీ రిలేట్ అయ్యే కమర్షియల్ ఎంటర్టైనర్. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా కాన్సెప్ట్ పరంగా చాలా కమర్షియల్ గా ఉంటాయి.
-ప్రస్తుతం గతం2, ఈ నగరానికి ఏమైంది రిపీట్, అలాగే ప్రియదర్శితో ఒక సినిమా నడుస్తున్నాయి. గతం2 ప్రమోషన్స్ త్వరలో స్టార్ట్ చేస్తాం. మిగతా రెండు సినిమాలు షూటింగ్లో ఉన్నాయి.






