New district: కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల (New district) ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను (Notifications) ప్రభుత్వం విడుదల చేసింది. మదనపల్లె (Madanapalle), మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలతో పాటు ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. నంద్యాల (Nandyal) జిల్లాలో బనగానపల్లె, శ్రీ సత్య సాయి జిల్లాలో మడకశిర, అనాకపల్లి జిల్లోలో నక్కపల్లి, మదనపల్లె జిల్లాలో పీలేరు, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్లను జారీ చేసింది. అభ్యంతరాలుంటే 30 రోజుల్లో కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలపాలని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేశారు.






